తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ రోజు విడుదల చేసింది.
1)) అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 20న అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు ప్రక్రియ మే 5న ముగియనుంది.
2)) ఇంజనీరింగ్ పరీక్షను జూలై 7,8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు.
3)) ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడానికి అభ్యర్థులు రూ.800 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ. 400.
4)) ఈ రెండు పరీక్షలకు అప్లై చేయాలనుకునే వారికి ఫీజు రూ.1600. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 800 చెల్లిస్తే సరిపోతుంది.
5)) అధికారిక వెబ్ సైట్: https://eamcet.tsche.ac.in/
6)) ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్టీయూ హైదరాబాద్(JNTUH) నిర్వహించనుంది
7)) సిలబస్ విషయానికి వస్తే.. ఫస్ట్ ఇయర్ ఇంటర్ నుంచి 55 శాతం ప్రశ్నలు, సెకండ్ ఇయర్ నుంచి 45 శాతం ప్రశ్నలు ఉంటాయి.
8)) పరీక్ష విషయానికి వస్తే అభ్యర్థులు 180 నిమిషాల్లో 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతు దారుల విజయం ఖాయం…