telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ముగిసిన ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు… పోలింగ్‌ శాతం ఎంతంటే ?

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా తూగో జిల్లాలో 66.21శాతం, ప్రకాశం 64.31శాతం పోలింగ్‌ నమోదు కాగా… అత్యల్పంగా విశాఖ జిల్లాలో 47.86 శాతం పోలింగ్‌ జరిగింది. ఇక పూర్తి పోలింగ్‌ ముగిసే వరకు 60 శాతంలోపే పోలింగ్‌ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాాాగా.. ఏపీలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు ఇవాళ పోలింగ్‌ జరిగింది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు… పోలింగ్ జరిగింది. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2 వేల 215 డివిజన్లు, వార్డులకు కలిపి… 7,552 మంది బరిలో ఉన్నారు. పోలింగ్‌కు… అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 15 కార్పొరేషన్లు ఉంటే… శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రికి ఎన్నికలు జరగడం లేదు. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకోవటం ఖాయమైంది. 

Related posts