telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

కృష్ణపట్నం కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్… నేటి నుంచే పంపిణీ !

నెల్లూరు కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు పాజిటివ్ నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం ఆయుర్వేదానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పంపిణీ చేయడానికి నిర్వహణ దారులు సన్నద్ధం అవుతున్నారు. 

కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న ఈ మందును, ఇవాళ్టి నుండి (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నామని నిర్వహణ దారులు పేర్కొన్నారు. 

ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదనీ వారు పేర్కొన్నారు. అయితే..కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది..ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించామని నిర్వహణ దారులు పేర్కొన్నారు.  ఇవాళ ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నామన్నారు.

Related posts