telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ పోటీ!

Priyanka likely to contest PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారణాసిలోమోదీతో కాంగ్రెసు నేత ప్రియాంక గాంధీ వాద్రా తలపడబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మోదీపై పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

రాయబరేలీ నుంచి గానీ అమేథీ నుంచి గానీ పోటీ చేయాలని పార్టీ మద్దతుదారులు మార్చిలో ఆమెను కోరారు. అయితే, వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదని ఆమె నవ్వుతూ అన్నారు. పార్టీ కోరితే తాను లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రియాంక గాంధీ గతంలో అన్నారు.

.ప్రియాంక గాంధీ మార్చిలో మూడు రోజుల పాటు ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసి వరకు గంగా యాత్ర చేపట్టారు. సాంచీ బాత్ ప్రియాంక కే సాత్ అనే అంశంపై ఆ యాత్ర దృష్టి కేంద్రీకరించింది. దీంతో వారణాసి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుందని తెలుస్తోంది.

Related posts