telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చురుకైన మెదడు కోసం .. ఇలా చేస్తే సరి.. !

tips to train active brain

బ్రెయిన్ ఉందా అంటుంటారు.. అసలు లేదని కాదు, ఉన్నా దానిని సరిగా వాడుకోవడంలేదని అర్ధం. కొందరు చురుగ్గా పనిచేస్తే, ఇంకొందరు అస్సలు పనిచేయరు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. శారీరక ఆరోగ్యమే మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటేనే అది మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

* వాల్ నట్స్ తింటే మన మెదడుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మెదడు పనితీరును మెరుగు పర్చడంలో ఇవి బాగా పని చేస్తాయి. ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటుంది. ఇవి మెదడులోని కణాలను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.

* ఎల్లప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళన, టెన్షన్, ఒత్తిడి వంటి వాటిని దూరంగా తరిమికొట్టాలి. లేదంటే మెదడుపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అది మెదడు పనితనాన్ని దెబ్బ తీస్తుంది.

* నలుగురిలోనూ కలసి తిరగడం అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా ఉండకూడదు ఎప్పుడు కొత్త వ్యక్తులను కలిసేందుకు ప్రయత్నించాలి. దీంతో మనకు చాలా విషయాలు తెలుస్తాయి.

* రెండు పూటలు మాత్రం అన్నం తీసుకుని.. సమయానికి నిద్రపోవడం.. సమయానికి నిద్రలేవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్రమశిక్షణ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

* సాయంత్రం పూట బేకరీలకు వెళ్లకుండా వాకింగ్‌కి వెళ్లాలి. చిన్నారులతో సమయం దొరికినప్పుడల్లా ప్లేగ్రౌండ్‌లో ఆటలాడాలి. ఎక్కువ శాతం లిఫ్ట్ కాకుండా మెట్లను ఉపయోగించాలి ఇలా చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు.

* మంచి ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్నీ పోషకాలు ఉన్నాయో లేదో చూసుకోండి. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు మాత్రం తప్పనిసరి. ముఖ్యంగా.. చేపలు మన డైట్‌లో ఉంటే మెదడు పనితీరు సరిగ్గా ఉంటుంది. ఇందులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు.. మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.

Related posts