చరిత్రను రికార్డులను తిరగరాసిన టీమిండియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సంచలన విజయంపై పలువురు ప్రముఖులు, ఇతర దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ఆనందాన్ని ప్రకటించారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరోను వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నామని సచిన్ ట్వీట్ చేశారు. బీసీసీఐతోపాటు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్క్ష్మణ్, శిఖర్ ధావన్ , ఇశాంత్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్ కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు తెలిపారు. కాగా ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్‌గా భావించే బ్రిస్బేన్‌లోని గబ్బాలో భారత్ విజయ బావుటా ఎగురవేసింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది.