telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

తుఫానుగా మారిన .. వాయుగుండం.. అప్రమత్తంగా ఉండాలి.. !

red alert in kerala on cyclone

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిశ మార్చుకోకపోగా, తుపానుగా మారింది. దీనికి ఫణిగా పేరు పెట్టారు. శ్రీహరికోటకు ఆగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. తీరంవైపు 45 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించారు.

మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపారు. మరోవైపు తుపాను గమనాన్ని ఏపీలోని ఆర్టీజీఎస్‌, ఐఎండీ నిశితంగా గమనిస్తున్నాయి. తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Related posts