telugu navyamedia
రాజకీయ వార్తలు

గురుద్వారాను మసీదుగా మార్చేందుకు పాక్ కుట్ర

India Pakistan Lahore Mosque

పాకిస్థాన్ మరో కుట్రకు తెరలేపింది. లాహోర్‌లో ఉన్న సిక్కుల గురుద్వారాను మసీదుగా మార్చేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. నగరంలోని నౌలఖా బజార్‌లో ఉన్న షహీదీ ఆస్థాన్ గురుద్వారాను సిక్కులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. భాయ్ తరుసింగ్ జీ ఇక్కడే అమరుడయ్యాడని సిక్కులు చెబుతారు. అయితే, అక్కడి మతవాదులు మాత్రం అది షహీద్ గంజ్ అనే మసీదని వాదిస్తున్నారు. పాక్ ప్రయత్నాలను భారత్ తీవ్రంగా ఖండించింది.

గురుద్వారాను మసీదుగా మార్చే ప్రయత్నాలు జరుగుతుండడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు సోమవారం లేఖ అందజేసింది. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్థాన్‌లోని మైనారిటీల రక్షణ, వారి మత స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేసింది.

Related posts