telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవికి జీహెచ్‌ఎంసీ జరిమానా

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం వర్మకు రూ.4వేల పెనాల్టీ విధించింది. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ ‘పవర్‌ స్టార్‌’ సినిమాకు సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నెటిజన్ ఒకరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున ఫైన్‌ వేయాల్సిందిగా ఈవీడీఎం విభాగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈవీడీఎం విభాగం వర్మకు ఈనెల 22వ తేదీన రూ.4వేలకు ఈ చలానా జారీ చేసింది. తాజాగా ‘పవర్ స్టార్’ సినిమా తీసిన వర్మ దాన్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Related posts