telugu navyamedia
రాజకీయ వార్తలు

డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకొంటాం: ట్రంప్

trump usa

క‌రోనా వైర‌స్ గురించి ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించ‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ట్రంప్ గ‌త మే నెల‌లో వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ ప్ర‌క్రియ‌కు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి త‌ప్పుకునే అంశంపై ఐక్య‌రాజ్య‌స‌మితితో పాటు అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ తెలియ‌జేశారు.

డబ్ల్యూహెచ్‌వో నుంచి త‌ప్పుకునేందుకు అమెరికా త‌మ‌కు నోటిఫై చేసిన‌ట్లు యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌తినిధి స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ 2021 జూలై 6 వ‌ర‌కు పూర్తికానున్నట్లు తెలుస్తున్న‌‌ది. డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా త‌ప్పుకుంటున్న‌ట్లు త‌మ‌కు కూడా లేఖ అందిన‌ట్లు ఫారిన్ రిలేష‌న్స్ క‌మిటీ డెమోక్రాట్ సేనేట‌ర్ రాబ‌ర్ట్ మెనెన్‌డేజ్ తెలిపారు.

Related posts