telugu navyamedia
రాజకీయ

ఆసియా లోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని శంకుస్థాపన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఇది ఆసియా లోనే అతి పెద్ద విమానాశ్రయం . ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవరు ప్రాంతంలో ఈ విమానాశ్రయం నిర్మాణం కాబోతుంది . 2024 సంవత్సరానికి దీని నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పశ్చిమ ఉత్తరప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీలో కోట్లాది ప్రజలకు ఉపయోగం ఉంటుందని మోడీ చెప్పారు.

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీ లోని ఉన్న‌ IGI విమానాశ్రయానికి 72 కిలో మీటర్ల దూరంలో వుంది. అలాగే నొయిడాకు 40 కిలో మీటర్ల దూరంలో వుంది , ఢిల్లీలో వున్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తు అవసరాలను తీర్చలేదని ,అందుకే ఈ విమానాశ్రయ అవసరాన్ని ప్రధాని గుర్తించారు . అందుకే రాజధానికి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి యోగి సర్కార్ పచ్చ జెండా ఊపింది . అన్ని అనుమతులు తీసుకున్న తరువాత ఈరోజు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రధానితో శంకుస్థాపన చేయించారు . ఈ అంతర్జాతీయ విమానాశ్రయం 13,000 ఎకరాల్లో 8 రన్ వే లతో నిర్మాణం కాబోతుంది .

లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మాట్లాడుతూ.. . ఈ ప్రాంతం అంతర్జాతీయ పటంలో ఉంది..పశ్చిమ యుపిలోని కోట్లాది మందికి ఉప‌యోగ‌ప‌డుతుంది. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఇది కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మాత్రమే కాదు, ఈ ప్రాంతాన్ని, ప్రజల జీవితాలను మారుస్తాయి’’ అని మోదీ అన్నారు. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ సేవల కోసం 40 ఎకరాల స్థలం కేటాయించ‌బ‌డింద‌ని ప్రధాని చెప్పారు. “దాదాపు రూ. 15,000 కోట్లు నిర్వహణ కోసం ఖర్చు అవుతుందని అన్నారు.

 

రెండు దశాబ్దాల క్రితం యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని ఊహించిందని, అయితే ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ఢిల్లీ-లక్నో మధ్య నిలిచిపోయిందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు.

“కుల రాజకీయాలు, వేల కోట్ల కుంభకోణాలు, అధ్వాన్నమైన రోడ్లు, పేదరికం, పెట్టుబడుల కొరత, ఆగిపోయిన వ్యాపారాలు , రాజకీయాలు నేరస్థుల మధ్య బంధం కారణంగా ఈ రాష్ట్రంలోని ప్రజలు అవమానాలు ఎదుర్కొన్నారు. యూపీకి చెందిన ప్రజలు రాష్ట్రానికి ఎప్పుడైనా పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకోగలరా అని అడుగుతారు. గత ప్రభుత్వాల పాలనలో చీకట్లు, నిర్వీర్యానికి దారితీసిన రాష్ట్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది’’ అని మోదీ అన్నారు.

UP leaving international mark, says PM Modi as he lays foundation of Noida international airport in Jewar | Latest News India - Hindustan Times

21వ శతాబ్దపు కొత్త భారతదేశం అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఇవి కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మాత్రమే కాదు, ఈ ప్రాంతాన్ని, ప్రజల జీవితాలను మారుస్తాయి” అని మోడీ అన్నారు. 

ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గౌతమ్ బుద్ధ్ నగర్ ఎంపీ మహేశ్ శర్మ, జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts