హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ అష్టలక్ష్మీ దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, స్థానిక టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చన ,అభిషేక పూజలు జరిపారు. పూజలు నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు సంకల్ప పూజలు నిర్వహించి, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపితే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని వేదపండితులు తెలిపారు.
డిసెంబర్ కి ముందే భారత్ లోకి ఆ వైరస్…?