telugu navyamedia
తెలంగాణ వార్తలు

20 మందికి ఐపీఎస్ కన్ఫామ్..

తెలంగాణలో పని చేస్తున్న 20 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్ కన్ఫామ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 సంవత్సరానికి గాను కోటిరెడ్డి, యల్. సుబ్బారాయుడు, నారాయణ రెడ్డి, శ్రీనివాసరావు, అన్నపూర్ణ, టి శ్రీనివాసరావు, పద్మజ, జానకి ధరావత్, లకు ఐపీఎస్ కన్ఫామ్ చేశారు.

2017 సంవత్సరానికి గాను యాదగిరి,2018 సంవత్సరానికి గాను ఆర్ నాగరాజు, ఎం, నారాయణ, 2019 సంవత్సరానికి గాను తిరుపతి, ఎస్, రాజేంద్ర ప్రసాద్, డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సురేష్ కుమార్, 2020 సంవత్సరానికి గాను అనురాధ, అనసూర్య, సలీమా, గిరిధర్, ప్రవీణ్ కుమార్ లకు ఐపిఎస్ లు గా కన్ఫామ్ చేశారు.

Related posts