telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ: దోస్త్- 2024 నోటిఫికేషన్ విడుదలైంది.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.

తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ 2024  వివరాలు:

*మొదటి విడత రిజిస్ట్రేషన్లు మే 6 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 25 వరకు విద్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

జూన్‌ 3న సీట్లను కేటాయిస్తారు. జూన్‌ 4 నుంచి 10వ తేదీ వరకు విద్యర్థులు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

*రెండో విడత రిజిస్ట్రేషన్‌ జూన్‌ 4 నుంచి ప్రారంభమవుతుంది. 13వ తేదీవరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

జూన్‌ 4 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ చేసుకోవచ్చు. ఇక జూన్‌ 18న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో జూన్‌ 19 నుంచి 24వ తేదీలోపు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

*ఇక చివరిదైన మూడో విడత రిజిస్ట్రేషన్‌ జూన్‌ 19 నుంచి ప్రారంభమవుతుంది.

జూన్‌ 25 వరకు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అదే నెల 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వవచ్చు.

జూన్‌ 29న సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే.. మూడో విడత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.

కాగా.. గత ఏడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక ఈ ఏడాది మొత్తం 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా దాదాపు 1,054 కాలేజీలు దోస్త్‌ (TS DOST) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాయి.

బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను ఆయా డిగ్రీ కాలేజీల్లో దోస్త్‌ (TS DOST) ద్వారా భర్తీ చేయనున్నారు.

అన్ని డిగ్రీ కోర్సులకు తరగతులుజూలై 8 నుండి ప్రారంభమవుతాయి.

Related posts