telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

హైదరాబాద్ : .. పోలీస్ ఉద్యాగాలకు .. ఉచిత శిక్షణ ..

free coaching for police training in

దిల్‌సుఖ్‌నగర్‌లోని నేతాజీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-1, గ్రూప్-2,గ్రూప్-3, ఎస్సై, పోలీస్ ఉద్యోగాల కోసం పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అభ్యర్థులకు ఇంటెన్సివ్ కోచింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ నిర్వాహకులు శ్రీనివాస్ రాజు తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు ఉచితంగా ఇంటెన్సివ్ కోచింగ్‌తోపాటు నామినల్ ఫీజుతో స్టడీ మెటీరియల్‌ను కూడా అందించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇతర అభ్యర్థులకు నామినల్ ఫీజులతో స్టడీ మెటీరియల్‌తోపాటు ఫుల్‌టైం కోచింగ్, నిత్యం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30తేదీ లోగా వారి పేర్లను నమోదు చేయించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద గల నేతాజీ స్టడీ సర్కిల్‌ను గానీ, 040-66633222, 88862 22275, 70132 11958 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

Related posts