దుబ్బాక ఉప ఎన్నిక మొదలైంది. ఇవాళ ఉదయం ప్రశాంతంగా దుబ్బాక ఉప ఎన్నికకు ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 98028 మంది పురుషులు, 100719 మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే..ఈ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నిక నిర్వాహణకు 5,000 సిబ్బందిని నియామకం చేశారు అధికారులు. అలాగే 315 బూత్ లు, 89 సమస్యాత్మక కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. కోవిడ్ నిబంధనలతో ఈ పోలింగ్ జరగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు చేసారు. దుబ్బాక పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇరవై మంది బరిలో ఉన్నారు. అయితే…దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కును టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత వినియోగించుకున్నారు. అటు బొప్పాపూర్ పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు ఓటు వేసారు. తొగుటలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.