telugu navyamedia
రాశి ఫలాలు

దిన ఫలితాలు : మే 4 శనివారం రాశిఫ‌లాలు.

మేషరాశి..

ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు.

వృషభరాశి..

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.

మిథునరాశి..

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకరాశి..

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహరాశి..

బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య రాశి..

ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

తులరాశి.

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

వృశ్చికరాశి..

సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

ధనుస్సురాశి..

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి.

మకరరాశి..

దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.

కుంభరాశి..

సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి.

మీనరాశి..

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

Related posts