telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 21, గురువారం రాశిఫలాలు..

మేషం
ఆర్థిక విషయాలలో పురోగతి. వృత్తి వ్యాపారాల కోసం ధనం అధికంగా ఖర్చుచేయాల్సి వస్తుంది.. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించు కుంటారు.

వృషభం
దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఎక్కువ‌వుతాయి. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు.

మిథునం
సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.. సహనం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు చవిచూడాల్సివస్తుంది.

కర్కాటకం
ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. వివాదాల పరిష్కారం అవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు..కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చించాల్సి వస్తుంది.

సింహం
ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు నెల‌కొంటాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు త‌ప్ప‌వు కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది.

కన్య
కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు.నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారు..ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు.

తుల
ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి.

వృశ్చికం
కుటుంబసభ్యులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. విందువినోదాలు చేస్తారు. ప‌నులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు ల‌భిస్తాయి. పోస్టల్, ఎల్‌ఐసి ఏజెంట్లకు ఆర్థికంగా బాగుంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.

ధనుస్సు
వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందువినోదాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం క‌లుగుతుంది.

మకరం
కుటుంబసభ్యులతో విభేదాలు నెల‌కొంటాయి.హోటల్, తినుబండారాలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. ఉద్యోగాలలో చికాకులు.మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.

కుంభం
ఆర్థిక లాభాలు వ‌స్తాయి. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీ యత్నాలకు కుటుంబీకుల సహకారం అందుతుంది.

మీనం
నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.

Related posts