telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 30, 2021 శనివారం రాశిఫ‌లాలు..

మేష రాశి..
ఆశాభావంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి.. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈ రాశికి చెందిన వ్యక్తులు భూమి నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో విజయం సాధించే అవకాశముంది. బంధువులు, మిత్రులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి.ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి..
వ్యాపార వర్గాలకు పనివారలతో చికాకులు తప్పవు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా మీ మాటలతో ప్రజల హృదయాలను ఆకర్షిస్తారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగులకు త‌గిన‌ గుర్తింపు వ‌స్తుంది.

మిథున రాశి..
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. ట్రాన్సర్లు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. బంధుప్రీతి కలదు. కుటుంబానికి దూరంగా ఉండేవారు ఈ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఆరోగ్యసమస్యలు త‌లెత్త‌వ‌చ్చు.

కర్కాటక రాశి..
నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

సింహరాశి..
మానసిక ప్రశాంతత ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది.

కన్యరాశి..
ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది.వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.

తులరాశి..
మంచి పనులు చేపడతారు. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. రావలసిన సొమ్ము స‌కాలంలో అందుతుంది. వ్యాపారులకు లాభాలు దక్కే ఛాన్స్ క‌నిపిస్తోంది.

వృశ్చిక రాశి..
చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అనారోగ్యం. వ్యాపారులకు ఆటుపోట్లు చూస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

ధనస్సు రాశి
రావలసిన ధనం ఆలస్యంగా అందటం వల్ల ఒడిదుడుకులు తప్పవు. ప్రారంభించబోయే పనుల్లో కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.

మకర రాశి..
స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో పరిచయాలేర్పడతాయి.ఆప్తుల సహాయంతో ఒక పని పూర్తి చేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కుంభరాశి
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. ఉద్యోగులకు నూతనోత్సాహం క‌లుగుతుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధువుల తో క‌లుస్తారు.

మీనరాశి..
ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. రవాణా రంగంలో వారికి సంతృప్తి క‌లుగుజేస్తుంది. ఈ రోజు మీ రాశికి చెందిన కొంతమంది వ్యక్తులు మాతృ పక్షం నుంచి ధనలాభాలను పొందే అవకాశముంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి.

 

 

Related posts