telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … నిర్ణయాలకు పెద్దల ఆమోదం.. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం…

today rasi falalu

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికంగా మరింత బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కొన్ని వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అవకాశాలు అసంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఇతరులకు సలహాల విషయంలో నిదానం పాటించండి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొంత అసంతృప్తి. వారం చివరిలో శుభవార్తలు. ఆస్తిలాభం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూవివాదాలు నెలకొంటాయి. ముఖ్య నిర్ణయాలలో తొందర పాటు వద్దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రార ంభంలో విందువినోదాలు. వాహనయోగం. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహాది వేడుకలకు హాజరవుతారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తగ్గే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోదాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మొదట్లో కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. అయితే క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. గులాబీ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమకు ఆశించిన ఫలితం కనిపించదు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి అటూఇటూగా ఉండి రుణయత్నాలు సాగిస్తారు. కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అయితే అవసరాలకు లోటు లేకుండా గడుస్తుంది. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి అందిన సమాచారంతో ఊరట లభిస్తుంది. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. వాహనాలు, భూములు కొనుగోలులో ప్రతిబంధకాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు తప్పవు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ధనలాభం. ఆస్తుల వివాదాలు పరిష్కారం. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్‌లో పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఆర్థిక విషయాలు అసంతృప్తి కలిగిస్తాయి. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల కృషిలో కొంత పురోగతి ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి పొందుతారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. గృహం, విలువైన వస్తువులు కొంటారు. పరిచయాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది. రాజకీయవర్గాలను ఊహించని పదవులు వరిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. నీలం, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు విస్మరించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు ఎదురుకావచ్చు. శ్రమమీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఒక కీలక వ్యక్తి పరిచయం కొంత ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు ఎట్టకేలకు దక్కుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

Related posts