telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అత్యాచారాల నేపథ్యంలో .. గన్ లైసెన్స్ లు అడుగుతున్న మహిళా లెక్చరర్స్ …

applications for guns increased in telangana

దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఆత్మరక్షణకు కోసం గన్ లైసెన్స్ ఇప్పించండి అంటూ ఓ మహిళా లెక్చరర్ వరంగల్ పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకుంది. వరంగల్​అర్బన్ జిల్లా న్యూ శాయంపేటకు చెందిన ప్రభుత్వ ఉద్యోగిని ఫాతిమా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా చేస్తోంది. జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి గన్ ఉంటే ఆత్మరక్షణ ఉంటుందని భావించింది. హన్మకొండలోని పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయానికి వెళ్లి తనకు గన్ లైసెన్స్ కావాలని లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంది. ఒక మహిళా ఉద్యోగి నుంచి ఇలాంటి రిక్వెస్ట్ రావడంతో అటు పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Related posts