ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ని సామర్లకోట మండలం జి.మేడపాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బాణాసంచా కార్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.