ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్ లపై ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. బుధవారం విశాఖపట్నం జిల్లా అరకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విభజన హామీలపై ప్రధాని నరేంద్ర మోదీ నమ్మించి మోసం చేశారని లోకేష్ ఆరోపించారు.
జగన్ పేరు ఇక నుంచి కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి అని లోకేశ్ వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమలు తుడిచేసే వ్యక్తికి ఓట్లు వేస్తారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారని అలాంటి కేసీఆర్ తో జగన్ అంటకాగుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.