telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే..అన్నీ ప్రైవేట్‌ పరం: జగన్‌

YS Jagan Files Nomination Pulivendul

చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే అన్నీ ప్రైవేట్‌ పరం చేస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదని, ఆర్టీసీ, కరెంట్‌ కూడా ప్రైవేట్‌ పరం చేస్తారని అన్నారు. వెట్ ల్యాండ్ పేరుతో తన అత్తగారి సొత్తంటూ పేదల భూములను లాగేస్తాడని, ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు సహా ఇక ఏమీ మిగలనివ్వడని దుయ్యబట్టారు.

ఏ పత్రిక చదవాలో, ఏ ఆస్పత్రికి వెళ్లాలో అన్నీ జన్మభూమి కమిటీలే చెబుతాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తాడని విమర్శించారు. చంద్రబాబు ఏ నేరాలు చేసినా పత్రికల్లో వార్తలుండవంటూ బాబుకు వత్తాసు పలికే ఎల్లో మీడియాపై జగన్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పాయకరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్ల బాబూరావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Related posts