ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు-1లో పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన పలువురు టీడీపీ నేతలు ఓట్లు వేశారు. టీడీపీ తరఫున బాలకృష్ణ తొలి ఓటు వేశారు. అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి కూడా ఓటు వేసేందుకు వచ్చారు. ఓటు వేసేందుకు టీడీపీ నేత అచ్చెన్నాయుడు హాజరుకాలేకపోయారు. కస్టడీలో ఉంటూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న ఆయనకు ఇంకా అనుమతి రాలేదని టీడీపీ తెలిపింది.
అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా