రెండు నెలల తర్వాత గంగవరం పోర్ట్, స్టీల్ ప్లాంట్ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గాజువాకలో ఆయన జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ జనవరి నుంచి ఆగనంపూడి టోల్‌గేట్‌పై పోరాడతామని తెలిపారు.
కోడి కత్తి అబ్బాయ్, కోడికత్తికి గాయపడిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యారని పవన్ ప్రశ్నించారు. కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసుపై వైసీపీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై జనసేన ప్రజల్లోకి తీసుకు వెళతామని చెప్పారు. జనసేన నేతలపై ఎన్నో అక్రమ కేసులు పెడుతున్నారని, వెంటనే ఎత్తు వేయాలని పవన్ డిమాండ్ చేశారు.
అపవిత్ర కూటమికి.. అవినీతి సర్కార్ కు ముగింపు: బీజేపీ