telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అభినేత్రి-2’ సినిమా విడుదల … వాయిదా ..

abhinetri 2 release will be on may last week

‘అభినేత్రి-2’ సినిమా మే 1న విడుదల కావలసినా, నిరవధికంగా వాయిదా పడింది. ముఖ్యంగా తెలంగాణాలో తగినన్ని థియేటర్లు లేనందున.. ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. 2016లో వచ్చిన అభినేత్రి చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ప్రభుదేవా, నందితా శ్వేత ప్రధాన తారాగణంగా తీసిన ఈ హారర్ కామెడీకి థియేటర్ల కొరత పెద్ద సమస్యగా మారింది. మే 1వ తేదీ బదులు ఈ చిత్రం మే 31న విడుదలయ్యే అవకాశాలున్నాయి. అదే రోజున సూర్య సినిమా.. ‘ఎన్ జీ కే’ కూడా రిలీజవుతుంది. తన ‘ దిక్సూచి ‘ మూవీకి తెలంగాణాలో కేవలం మూడు థియేటర్లు మాత్రమే లభ్యమయ్యాయని నటుడు దిలీప్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి కారణం, హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ సిరీస్ భారీగా దేశంలో విడుదల కావటమే. ఈ చిత్రం 2500 థియేటర్ లలో విడుదల చేశారు.

Related posts