telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాని సినిమాకు 45 కోట్లు… నిజమేనా..?

Tuck-Jagadish

తన నటనా జీవితం మొదటి నుంచి కొత్త తరహా కథలతో అందరిని ఆకట్టుకున్నాడు నాచురల్ స్టార్ నానీ. వైవిధ్యమైన పాత్రలతో అందరిని మెప్పించి నాచురల్ స్టార్‌గా నిలిచాడు. అయితే ప్రస్తుతం నానీ శివ నిర్వాణ దర్వకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు కథానాయికలుగా కనపించనున్నారు. దాంతో పాటుగా ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం తన చివరి షెడ్యూల్‌ పూర్తిచేసుకొంటోంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నుకోరి సినిమా తరువాత నాని, శివ కాంబోలో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమాను దాదాపు రూ. 45 కోట్లకు కోనేందుకు సిద్దంగా ఉన్నాడని సమాచారం. అయితే ఇటీవల నాని విడుదల చేసిన సినిమా వీ ప్లాప్ తరువాత కూడా నానీకి ఇంతటి బిజినెస్ ఉందా లేదంటే కేవలం మార్కెటెంగ్‌ను పెంచుకోవాలని చేస్తున్నారా అని కొందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే అంతటి పరాజయం తరువాత కూడా ఇంతటి బిజినెస్ జరగడం అంటే గొప్పనే చెప్పుకోవాలి.

Related posts