telugu navyamedia
క్రీడలు వార్తలు

అందుకు ప్రధాన కారణం ఐపీఎల్ అంటున్న సచిన్…

Sachin tendulkar

భారత జట్టుకు రిజర్వ్‌ బెంచ్‌ బలం పెరగడానికి ఐపీఎల్‌ ప్రధాన కారణమని క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అన్నారు. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడడం వల్ల యువకులకు మేలు జరుగుతుందన్నారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌ సత్తాచాటిన నేపథ్యంలో సచిన్ అలా అన్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ ఇషాన్‌, సూర్యకుమార్‌ అద్భుతంగా రాణించడంతో.. భారత జట్టులో చోటుదక్కించుకున్నారు. అంతేకాదు ఆడిన తొలి మ్యాచులోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే తాజాగా సచిన్ మాట్లాడుతూ… అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌ సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే.. వారు ఐపీఎల్‌లో ఆడి ఆరితేరడమే ఇందుకు కారణం. ఐపీఎల్ వల్ల అందరి బౌలింగ్‌ను మన యువ ఆటగాళ్లు ముందే ఎదుర్కొంటున్నారు’ అని అన్నారు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అనుభవం ఐపీఎల్‌ వల్ల వస్తుందని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.

Related posts