తెలంగాణలో ఉద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున అంశం పీఆర్సీ. అయితే ఇప్పుడు వారందరికీ ఓ శుభవార్త. అదేంటంటే… తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీఆర్సీ మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి తెలంగాణలో పీఆర్సీ గురించి ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. పీఆర్సీపై సూచనప్రాయంగా చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రెండు, మూడు రోజుల్లో స్వయంగా తానే పీఆర్సీపై ప్రకటన చేస్తానని కూడా మొన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ శుభవార్త వినిపించారు. రెండు, మూడు రోజుల్లోనే గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్.. ఉద్యోగుల మీద తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చుపించామన్నారు. అయితే చూడాలి మరి ఈ విషయం పై కేసీఆర్ ఏ విధమైన ప్రకటన చేస్తారు అనేది.
previous post