telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

“జనసేన” పార్టీ డబ్బు పంచడంపై నాగబాబు స్పందన

రాజకీయాల్లో డబ్బుకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో ఎంతలా ఖర్చవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కొందరు రాజకీయ నేతలు ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం జీరో మనీ పాలిటిక్స్ అనేవి సాధ్యం కావని రాజకీయ నేతల అభిప్రాయం. అయితే నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్ధి నాగబాబు జీరో మనీ పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను పోటీ చేసిన నరసాపురం నియోజకవర్గం నుండి ఎప్పుడూ అరవై శాతం మాత్రమే ఓటింగ్ వచ్చే అక్కడఈసారి 81 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైందని అన్నారు. ఇదే తరహాలో కొనసాగితే 2024లో జరగబోయే ఎన్నికల్లో 95 శాతం ఓటింగ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. 95 శాతం ఓటింగ్ వచ్చిందంటే.. డబ్బు అనే కాన్సెప్ట్ పని చేయనట్లేనని.. ఇక ఏ నాయకుడు డబ్బులతో ఓట్లను కొనలేడని, జనసేన పార్టీ తరఫున డబ్బులు పంచకూడదని నిర్ణయం తీసుకున్నామని, తమతో పాటు వచ్చిన కార్యకర్తలకు భోజనం పెట్టడం, పెట్రోల్ ఖర్చులు చూసుకోవడం వంటివి మాత్రమే చేశామని చెప్పుకొచ్చారు. ఎలెక్షన్ కమిషన్ ఇచ్చిన బడ్జెట్ వచ్చిన మొత్తాన్ని వారికే ఖర్చు పెట్టామని, అది మినిమమ్ కర్టసీ అని అన్నారు నాగబాబు. 

Related posts