telugu navyamedia
సినిమా వార్తలు

భగీరథ గారికి .. జన్మదిన శుభాకాంక్షలు ..

Happy Birthday Senior Journalist Bhageeradha Sir

భగీరథ గారికి మూడున్నర దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా ఎంతో అనుభవం ఉంది. ఈ కాలంలో ఆయన పలు వార్తా పత్రికలు ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ; ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ మరియు సినీ మ్యాగజైన్ లు జ్యోతి చిత్ర, వెండితెర వంటి వాటికి తమ సేవలు అందించారు. ఈ ప్రయాణంలో ఆయన తెలుగు భాషపై అద్భుతమైన పట్టు సాధించడంలో విజయం సాధించడంలో కృతకుచ్యులయ్యారు.

Happy Birthday Senior Journalist Bhageeradha Sir (2)

విద్యావిషయానికి వస్తే, 2010లో స్థానిక డా. బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో మాస్టర్ అఫ్ ఆర్ట్స్ ప్రోగ్రాం లో తెలుగు సినిమా అనే విభాగాన్ని తీసుకొచ్చారు. తన ప్రయాణంలో ఆయన సినీ పరిశ్రమకు సేవలందింస్తూనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నంది పురస్కారాల కమిటీలో సభ్యుడిగా 1992, 1997 మరియు 2001 లో సేవలందించారు. 2017లో 64వ జాతీయ సినీ పురస్కారాలకు జ్యూరీ గా కూడా ఉన్నారు.

Happy Birthday Senior Journalist Bhageeradha Sir Happy Birthday Senior Journalist Bhageeradha Sir

భగీరథ గారు సినీ పరిశ్రమకు చేసిన కృషికి మరియు దక్షిణ భారత సినీ ఛాంబర్ కు చేసిన సేవలకు గాను ఇండియన్ సెంటినరీ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. ఆయన ఇన్నేళ్ల కృషికి పలు పురస్కారాలు అందుకున్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సినీగోష్ అవార్డు వారు ఇచ్చిన బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు 1992, 1997కు గాను అందుకున్నారు. ఇంకా ఆంధ్రరాష్ట్రం నుండి సినీ విమర్శకుడిగా 1977, 2000; 1999లో కిన్నెరా ఫిలిం అవార్డు బెస్ట్ జర్నలిస్ట్; 2001, 2012లో వంశీ ఫిలిం అవార్డు-బెస్ట్ జర్నలిస్ట్; 2010లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డు-బెస్ట్ జర్నలిస్ట్; 2011లో ఫిలిం నగర్ దైవసన్నిదానం లో బెస్ట్ జర్నలిస్ట్ గా; 2014లో ప్రజా డైరీ సెలబ్రిటీ అవార్డు-బెస్ట్ జర్నలిస్ట్ గా; అదే సంవత్సరంలో హైదరాబాద్ లో వాజ్ పేయీ మరియు వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుండి పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి మెమోరియల్ అవార్డు; 2016లో న్యూ ఢిల్లీ తెలుగు అకాడమీ నుండి విశ్వభారతి పురస్కార్ అవార్డు; 2017లో భరత్ ఆర్ట్స్ అకాడమీ నుండి ప్రతిభా పురస్కార్ అవార్డులు అందుకున్నారు.

Happy Birthday Senior Journalist Bhageeradha Sir

సామాన్యుడు, స్వాగతం వంటి చిత్రాలకు కూడా భగీరథ గారు కోఆర్డినేటర్ గా తమ సేవలను అందించారు. అలాగే ఆయన స్వయంగా చిత్రీకరించిన నజరానా అనే చిల్డ్రన్ ఫీచర్ ఫిలిం కు గాను 2010లో ఆంధ్రప్రదేశ్ నుండి బంగారు నందిని అందుకుంది. రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాల ద్వారా ఆయన పద్మశ్రీ డివిఎస్ రాజు, హైదరాబాద్ గురించి చెప్పారు. అలాగే నేటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరియు మాచర్ల దేవి(కోర్ట్ డాన్సర్ ఓకే కాకతీయ డైనష్టి)పై కూడా ఆయన రెండు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Happy Birthday Senior Journalist Bhageeradha Sir Happy Birthday Senior Journalist Bhageeradha Sir

ఆయన సేవలను గుర్తించిన వంగూరి ఫౌండేషన్ ద్వారా 9వ అమెరికా తెలుగు లిటరరీ కాన్ఫరెన్స్ లో 2014, అక్టోబర్ 25, 26 తేదీలలో హౌస్టన్ టెక్సాస్ లో ప్రసంగించారు. 2007 నుండి ఆయన లిటరసీ మీద ఉన్న మక్కువతో దక్షిణ భారత హిందూ సామ్రాజ్యము గురించి పరిశోధన కొనసాగిస్తున్నారు.

Happy Birthday Senior Journalist Bhageeradha Sir Happy Birthday Senior Journalist Bhageeradha Sir

నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు అందుకుంటున్న ఆయనకు మా ‘నవ్యమీడియా.తెలుగు.నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్లు : నవ్యమీడియా.తెలుగు.

Happy Birthday Senior Journalist Bhageeradha Sir Happy Birthday Senior Journalist Bhageeradha Sir

Related posts