telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!

Ali comments Pawan Kalyan YCP

ప్రముఖ సినీ నటుడు అలీ సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అలీ చేసిన వ్యాఖ్యలు వైసీపీని కలవరపాటుకు గురిచేశాయి. అలీ పవన్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అంటూనే ఆయన సక్సెస్ అయితే తాను సక్సెస్ అయినట్టు ఫీలవుతానని వ్యాఖ్యానించారు.

అలీ చేసిన ఈ కామెంట్‌తో పక్కనే ఉన్న వైసీపీ నేతల ముఖం ఒకింత చిన్నబుచ్చుకుంది. పవన్ సక్సెస్ అయితే తాను సక్సెస్ అయినట్టే అని అలీ అనడాన్ని గమనిస్తే, జనసేన విజయం సాధిస్తే వైసీపీలో ఉన్నప్పటికీ తానూ హర్షిస్తానన్న రీతిలో అలీ వ్యాఖ్యలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఒక పార్టీలో చేరి, ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్న మరో పార్టీ అధినేత విజయాన్ని కాంక్షించడంపై వైసీపీలోని కొందరు  నేతలు అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts