జగన్‌ను నమ్మి ప్రజలు ఓటేస్తారని, ఆంధ్ర రాష్ట్రంపై పెత్తనం వస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. జగన్ కు అధికారం కట్టబెట్టేందుకు కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్‌లో వ్యాపారాలున్న టీడీపీ నేతలు వైసీపీలో చేరడం వెనుక కేసీఆర్ బెదిరింపులు లేవా? అని లేఖలో ప్రశ్నించారు. ‘టీడీపీని ఎదుర్కొనే సత్తా లేక జగన్ మీ మద్దతు కోరడం, మీరు రూ.2 వేల కోట్లు పంపడం వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో వాడిన ఓట్ల తొలగింపు స్ట్రాటజీనే ఏపీలో కూడా జగన్‌తో కేసీఆర్ అమలు చేయిస్తున్నారని విమార్శించారు. తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు రావడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
నాకు పార్టీలో అవమానం జరుగుతోంది- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు