telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పునర్నవి ఎమోషనల్ పోస్ట్… నిన్ను చాలా మిస్ అవుతున్నా…!

Punarnavi

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 తెలుగు ముగింపు దశకు చేరుకుంది. ఇంక ఒక్కవారం ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇప్పటికే రాహుల్ ఫైనల్‌కు వెళ్లిపోయాడు. ఇక వరుణ్ సందేశ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిల్లో నలుగురు ఫైనల్‌కు చేరుతారు. ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. తాజా ఎపిసోడ్ లో బాబా మాస్టర్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి మూడు వారాల ముందే ఎలిమినేట్ అయిన పునర్నవి ప్రస్తుతం రిలాక్స్ అవుతూ.. తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పున్ను మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ హౌజ్ ప్రేమ పావురాలుగా అదరగొట్టారు. అది అలా ఉంటే తాజాగా పున్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో ఎమోషన్‌గా ధన్‌తేరాస్‌ను సెలెబ్రేట్ చేసుకుంటున్నానని, అయితే ఈ వేడుకలో అమ్మను చాలా మిస్ అవుతున్నానని పేర్కోంది. అమ్మకు గుర్తుగా ఈ రోజు అమ్మ చీర ధరించి ఈ ధన్‌తేరాస్‌ను సెలెబ్రేట్ చేసుకుంటున్నానని ఎమోషనల్‌గా ఓ పోస్ట్ చేసింది. కాగా పునర్నవి ప్రస్తుతం ‘సైకిల్’, ‘చిన్న విరామం’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు పున్నుకు అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

I wish you all a happy Dhanteras. 😊✨ Wearing my mothers old saree,Major missing my mum. #diwali2019 #sustainablediwali

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

Related posts