ఇప్పటి వరకు ఏపీలో ప్రచారం హోరెతించిన పవన్ కళ్యాణ్ ఇక తెలంగాణపై ద్రుష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగానే పవన్ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. పొత్తు ధర్మంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయవతి ఈనెల 2న రాష్ట్రానికి రానున్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి ఆమె అనేక సభల్లో పాల్గొంటారు.
ఏప్రిల్ 3న విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. మాయావతి ఆ మరుసటిరోజు తిరుపతిలో జరిగే సభకు వెళతారు. అదేరోజు సాయంత్రం పవన్ కల్యాణ్ తో కలిసి హైదరాబాద్ చేరుకుని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది.
బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్