telugu navyamedia
సినిమా వార్తలు

రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు మృతికి కారణమిదే..

రెబల్ స్టార్ కృష్ణం రాజు  గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో   హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కృష్ణంరాజు మృతికి గల కారణాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు . “కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. 

గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గతేడాది ఆయన కాలికి స‌ర్జ‌రీ జ‌రిగింది.. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు. 

Senior Actor Krishnam Raju Political Career Krishnam Raju Death News | Krishnam  Raju Political Career: రాజకీయాల్లోనూ రెబల్ స్టార్, ఓడిన చోటే నెగ్గి కేంద్ర  మంత్రి అయిన కృష్ణంరాజు

పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆస్పత్రిలో చేరిన‌ప్ప‌టి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించామ‌ని తెలిపారు.

ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన వైద్యం చేశామ‌ని,
అయితే ఇవాళ  తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల చనిపోయార‌ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు చిత్రసీమలో రెబల్‌ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు.

U.V.Krishnam Raju on Twitter: "Vilambi nama samvatsara subhakanshalu, from  my family to yours 🎋 #HappyUgadi https://t.co/bHvvIKrPNa" / Twitter

కృష్ణంరాజు విలక్షణమైన నటనా శైలి కారణంగా ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1977లో అమరదీపం చిత్రానికి, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో ఆయన ప్రదర్శించిన నట విశ్వరూపానికి నంది అవార్డులతో సత్కరించింది. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న కృష్ణంరాజు.. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు..

తెలుగు చిత్రసీమలో ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన నటుడు కృష్ణంరాజు మరణంతో చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది..

Related posts