telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి …

nikhil

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పరిమితులకు లోబడి అతి తక్కువ మంది బంధువులు, కుటుంబీకుల మధ్య రేవతిని ఏప్రిల్ 17 ఉదయం వివాహమాడాడు నిఖిల్ గౌడ. అయితే కరోనా వల్ల వీరి వివాహం వాయిదా పడుతుందనే వార్తలు రాగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు ఉద‌యం బెంగ‌ళూరుతోని ఫామ్ హౌస్‌లో వివాహా తంతుని పూర్తి చేశారు. జాగ్వార్ సినిమాతో హీరోగా మెరిసిన నిఖిల్‌ గౌడకు మంచి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. తాత దేవగౌడ మాజీ ప్రధాని కాగా.. తండ్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ఇక నిఖిల్ పెళ్లి చేసుకున్న రేవతి తండ్రి రేవన్న కూడా కన్నడలో మంచి పేరున్న పొలిటికల్ లీడర్. కరోనా నేపథ్యంలో అందరు వివాహాలను మిగతా ఫంక్షన్లను రద్దు చేసుకుంటే ఈయన మాత్రం తన కుటుంబ సభ్యలు కొద్ది మంది సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. తెలుగు హీరోలు నితిన్, నిఖిల్‌లు తమ పెళ్లిని వాయిదా వేసుకోగా.. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి గౌడ త‌న‌యుడు కన్నడ హీరో నిఖిల్ గౌడ పెళ్లి విషయంలో వెనక్కి తగ్గలేదు.

Related posts