telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షారుఖ్ హిట్ సాంగ్ పర్షియన్ నోట…!

Sharukha-Khan

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివ‌రిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. షారూఖ్ ఖాన్‌కి దేశ విదేశాల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఇండోనేషియాకి చెందిన షారూఖ్ అభిమానులు ‘కుచ్ కుచ్ హోతాహై’.. సినిమాలో ‘‘తుమ్ పాస్ ఆయే.. యు ముస్కురాయే’’ పాటకి స్పూఫ్ చేశారు. చిత్రంలో న‌టించిన షారుఖ్, కాజోల్, రాణీ ముఖర్జీలు సాంగ్‌లో ఎలా ప్ర‌ద‌ర్శ‌న చేశారో ఇండోనేషియ‌న్స్ కూడా అలానే త‌మ హావభావాల‌ని ప్ర‌ద‌ర్శించి నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా ప‌ర్షియ‌న్ అభిమాని ఒక‌రు దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే చిత్రం నుండి తుజే దేఖాతో యే జానా స‌న‌మ్ అనే పాట‌ని ఆల‌పించారు. ఆయ‌న టాలెంట్‌ని ఓ వ్య‌క్తి రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అది షారూఖ్ దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా వీడియోని షేర్ చేస్తూ ఈ ఘ‌న‌త సింగ‌ర్‌కి ద‌క్కుతుంద‌ని అన్నాడు. 24 ఏళ్ళ క్రితం దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే చిత్రం విడుదలైంది.

Related posts