telugu navyamedia
సినిమా వార్తలు

‘ఒకే ఒక జీవితం’ చూసి ఎమోషనల్ అయిన నాగార్జున

శ‌ర్వానంద్‌, రీతూ వ‌ర్మం జంట‌గా న‌టించిన చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీకార్తీక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ అక్కినేని అమ‌ల‌, వెన్న‌ల కిశోర్ , ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్ ఆర్ ప్ర‌కాష్‌బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.

ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమా థియేటర్‌లో ప్రత్యేక ప్రీమియర్ షో వేసించి చిత్ర‌యూనిట్‌. ఈ షోకి నాగార్జున‌, అఖిల్‌, ద‌ర్శ‌కులు దేవ క‌ట్టా, హ‌ను రాఘ‌వ‌పూడి, చందూ మొండేటి, మేర్ల‌పాక గాంధీ, వ‌శిష్ట్‌, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Nagarjuna Impressed With 'Oke Oka Jeevitham' | ManaStars

కాగా.. ఈ సినిమా చూసిన అక్కినేని నాగార్జున అఖిల్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ముఖ్యం గా త‌ల్లీ కొడుకుల మ‌ధ్య వ‌చ్చే కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ నాగ్‌కి కంట‌త‌డి పెట్టించాయ‌ట‌. ఇంత గొప్ప క‌థ‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడి కార్తీక్‌ని, అద్భుతంగా న‌టించిన‌ శ‌ర్వానంద్‌ని అక్కినేని హీరోలు అభినందించారు.

కాగా..టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌గా సాగే ఈ సినిమాతో చాలా కాలం తర్వాత అమల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

Related posts