ప్రస్తుతం ఆర్ఆరఆర్ సినిమాలో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అయినను పోయిరావలే సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌తో పాటుగా మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరో స్నేహితుని పాత్ర ఉందనీ, అందులో యువ హీరో నవీన్ పోలిసెట్టి చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు వార్తలు సినీ సర్కిల్స్‌లో తెగ హల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా నెగిటివ్ పాత్ర చేయనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందంట. హీరో పాత్ర రాజకీయాల్లోకి కూడా అరంగేట్రం చేస్తుందంట. ఇదిలా ఉంటే నవీన్ పోలిసెట్టి ప్రస్తుతం జాతి రత్నాలు అనే కామెడీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చుడాలిమరి వీరిద్దరూ ఆ సినిమాలో కనిపిస్తారా… లేదా అనేది.
previous post
పవన్ ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్