telugu navyamedia
సినిమా వార్తలు

‘రాధేశ్యామ్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్ ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా న‌టిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్‌. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా టీజర్ రిలీజ్​ చేయనున్నట్లు మూవీ మేక‌ర్స్ వెల్లడించారు.

Prabhas to release Radhe Shyam teaser on his 41st birthday? - Movies News

దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ‘హూ ఈజ్ విక్రమాదిత్య’ అనే క్యాప్షన్​తో రాసి ఉండి. ఇంగ్లీష్​లో ఉండే ఈ టీజర్​తో పాటు అన్ని భాషల సబ్​టైటిల్స్​ రానున్నాయి. ‘ పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతోన్నప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల స్టిల్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.

Beats Of Radhe Shyam: An Epic Love Story!

ఈ సినిమాలో జగపతిబాబు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజ్ చేయబోతున్నారు.

Related posts