telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

50 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో హీరోయిన్ ఆఫీస్… వీడియో వైరల్

Kangana

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ ‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ పేరుతో ఓ ప్రొడక్షన్‌హౌస్‌ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ముంబయిలోని విలాసవంతమైన పాలీహిల్‌ ప్రాంతంలో ఆఫీసును నెలకొల్పింది. దాదాపు 50 కోట్ల భారీ వ్యయంతో కంగనా ఈ ఆఫీసును నిర్మించుకోవడం విశేషంగా చెబుతున్నారుచెప్పుకుంటున్నారు. తన పదేళ్ల శ్రమకు ప్రతిబింబంగా కట్టుకున్న కలలసౌధమిదని కంగనారనౌత్‌ వ్యాఖ్యానించింది. పూర్తి ప్లాస్టిక్‌ రహితంగా అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ఆఫీసుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది కంగనా. సాధారణంగా సినీతారలు తమ స్వగృహాల విషయంలో భారీ మొత్తాల్ని వెచ్చిస్తారు. కేవలం ఆఫీసు నిర్మాణం కోసమే 50 కోట్లు ఖర్చుపెట్టి కంగనారనౌత్‌ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

Related posts