శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మహా సముద్రం’. ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అనూ ఇమాన్యుల్ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈరోజు అనూ ఇమాన్యుల్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుండి ఇమాన్యుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులో అనూ లుక్ యూత్ ను కట్టిపడేస్తుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, లవ్ ఉంటాయని అలాగే ఆర్ ఎక్స్ 100 తో హిట్ అందుకున్న అజయ్ ఇప్పుడు అంతకంటే సూపర్ హిట్ సినిమా తీయబోతున్నాడని ఇంతకముందే చిత్రబృందం తెలిపింది. అయితే అనూ కు చాలా కాలం నుండి తెలుగులో సరైన హిట్ లేదు. కాబట్టి ఈ సినిమానైనా ఆ ముద్దుగుమ్మకు మంచి హిట్ అందిస్తుందా… లేదా అనేది చూడాలి.
previous post
ఈఎస్ఐ మందుల స్కామ్‌లో అధికారపార్టీ నేతలు: లక్ష్మణ్