telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రెండు మెగాస్టార్ హిట్ చిత్రాలు… వరుణ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందన్న నాగబాబు

varun tej on chiranjeevi biopic

మెగా బ్రదర్ నాగబాబు గత కొన్ని రోజులుగా సంచలన ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓ అభిమాని.. మీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఏ సినిమాని వరుణ్ రీమేక్ చేస్తే బాగుంటుందని అడగ్గా .. నాగబాబు ఇలా సమాధానం ఇచ్చారు. అన్నయ్య చేసిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలను.. వరుణ్ రీమేక్ చేస్తే చూడాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టారు. ఈ రెండు సినిమాలు కూడా చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించాయి. ఈ రెండు సినిమాల్లోని పాత్రలని వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు.. హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు నాగబాబు. ఈ సినిమాల్లోని పాత్రలు వరుణ్‌కి బాగా సెట్ అవుతాయన్నారు. ఇక చిరంజీవి కెరీర్‌లో స్పెషల్ చిత్రాలుగా నిలిచిన ఈ రెండింటిని వరుణ్ చేయడం పెద్ద సాహసమే అని కూడా పేర్కొన్నారు నాగబాబు. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

Related posts