telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

గల్లా కు .. చంద్రబాబు సరికొత్త బాధ్యతలు…

galla jayadev got new responsibilities

ఈరోజు టీడీపీ శానససభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ను టీడీపీ పార్లమెంటరీ నేతగా చంద్రబాబు నియమించారు. అలాగే శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడిని లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఖరారు చేశారు. రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా సుజనా చౌదరిని నియమించారు.

అమరావతిలో జరిగిన సమావేశంలో పార్టీ కార్యాలయం విషయంలో టీడీపీ నేతల మధ్య చర్చ సాగింది. గుంటూరులోని టీడీపీ కార్యాలయం అందరికీ అందుబాటులో లేదనీ, విజయవాడలో అయితే నేతలందరికీ అందుబాటులో ఉంటుందని పలువురు నేతలు పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. విజయవాడలో టీడీపీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు బాధ్యతను కేశినేని నానికి అప్పగించారు.

Related posts