telugu navyamedia
సినిమా వార్తలు

కలెక్షన్ కింగ్ నిజమైన లెజెండ్ : సూర్య

surya gold gift to unit

మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌స్తుతం “సూరరై పోట్రు” సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో మోహ‌న్ బాబు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. “గురు” సినిమాను రూపొందించిన సుధా కొంగ‌ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో మోహన్ బాబు జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసిన సూర్య మోహన్ బాబును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. “మోహన్ బాబు సర్ తో కలిసి ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న నిజ‌మైన లెజెండ్‌. గొప్ప క్రమశిక్షణ కలిగిన వ్య‌క్తి. గ్యారేజ్ లో ఉన్న దశ నుంచి 500 సినిమాలకు పైగా నటించిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయ‌క‌మైన‌ది. ఇదో అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. “సూరరై పొట్రు”లో భాగం అయినందుకు ధ‌న్య‌వాదాలు సర్” అంటూ సూర్య ట్వీట్ చేశాడు.

Related posts