telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగర్‌ సునీతకు ఎంగ్మేజ్‌మెంట్‌… ఎవరితినో తెలుసా !

ప్రముఖ సింగర్‌ సునీత ఇవాళ ఉదయం ఎంగేజ్మ్ంట్‌ చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగా సాగిన విషయం విదితమే. అయితే.. ఆ వార్తను నిజం చేస్తూ ఆమె ఇవాళ ఉదయమే వివాహ నిశ్చితార్ధం చేసుకున్నట్లు సమాచారం. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఆమె తెలుగు డిజిటల్‌ మీడియాలో ఓ బిజినెస్‌ మ్యాన్‌తో నిశ్చితార్ధం చేసుకున్నారు. సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లియింది. ఇద్దరు పిల్లలు పుట్టాక… భర్త తీరుతో విసిగిపోయిన సునీత.. చాలా ఏళ్లుగా ఆయనకు దూరంగా ఉంటుంది. తాజాగా.. ఆమె ఓ బిజినెస్‌ మ్యాన్‌ ని నిశ్చితార్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఇది వరకే పెళ్లయిందని అంటున్నారు. ఈ అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సునీతకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిశ్చితార్థం విషయం ఎవరికీ తెలియకుండా చేసుకున్నారు. ఈ నిశ్చితార్ధ వ్యవహారం ఎప్పుడు ప్రకటిస్తారో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts