telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

నవంబర్ 18, బుధవారం దినఫలాలు : దూర ప్రయాణాలు, సంతోషం

మేషం : హామీలు, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ గౌరవాభిమానాలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.

వృషభం : అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రభుత్వ పరంగా రుణమాఫీలు, సబ్సీడీలు అధికంగా ఉంటాయి. సంతానం విషయంలో శుభలితాలు సంభవం.

మిథునం : భాగస్వామికులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. మీకందిన చెక్కుల చెల్లక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది.

కర్కాటకం : ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు.

సింహం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యాపారాలను సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్య భంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. సభ్యత్వాలు పదవులు, దైవదీక్షలు స్వీకరిస్తారు.

కన్య : పెద్దమొత్తం ధన సహాయం మంచిదికాదు. హోల్‌సేల్ వ్యాపారులు పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. మీ తప్పిదాలను తెలివిగా సమర్థించుకుంటారు.

తుల : చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఒక శుభకార్యాన్ని ఆడంబరంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఫిర్యాదులు, కేసులు, వెనక్కు తీసుకుంటారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రావలసిన ఆదాయన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి.

వృశ్చికం : రుణం తీర్చి తాకట్టు విడిపించుకుంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ తగదు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రేషన్, గ్యాస్, పెట్రో డీలర్ల వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.

ధనస్సు : దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జాయింట్ వెంచర్ల వ్యాపారాల విస్తరణ, పొదుపు పథకాలకు అనుకూలం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. ఉద్యోగస్తులు, అధికారుల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య దాపరికం తగదు.

మకరం : హామీలిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఆశాజనకమైన మార్పులు సంభవం. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలు ఉన్నాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదర్కొంటారు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది.

కుంభం : వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు అందుకుంటారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. నూతన వ్యాపారాలు, ఉమ్మడి వెంచర్లు ప్రస్తుతానికి తగవు. ఏది జరిగినా మంచికేనని భావించండి.

మీనం : ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ వహించండి. పెద్దలు, శ్రేయోభిలాషులు మాటను శిరసావహిస్తారు. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది.

Related posts