జ్వరం అనేది వ్యాధి కాదు. వ్యాధి లక్షణం. శరీరం లో ఏదయినా భాగానికి ఇన్ఫెక్షన్ సోకి నప్పుడు, కొన్ని సందర్భాలలో వైరస్ ల కారణం గాను జ్వరం వస్తుంది. ఇన్ఫెక్షన్ బాక్టీరియా వల్ల, కలుషితం అయిన ఆహారం, నీరు, వాతావరణం లో మార్పు ల వలన వస్తుంది. ముందు గా డాక్టర్ లు చేయవలసినది, ఎందుకు జ్వరం వచ్చింది పరిశీ లించడం.తరువాత తగిన వైద్యం చెయ్యడం.
#జ్వరం_అంటే_ఏమిటి? మన శరీర ఉష్ణోగ్రత సాధారణ పరిస్థితుల్లో 98.6° F, .37°C (సాధారణoగా కొద్దిపాటి తేడా ఉండచ్చు ) అది ఏ మాత్రం పెరిగినా జ్వరం అంటారు. శరీరం కాస్త వేడిగా ఉంటుంది. ఇది మరింత పెరిగితే వేడి మరికాస్త ఎక్కువ. దీనికి తోడుగా ఉండేది తలనొప్పి.ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానితో పోరాడ డానికి రక్తం లోని సైన్యం (తెల్ల రక్త కణాలు )రడీ గా ఉంటుంది. ఆ పోరాటం లోనే జ్వరం వస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే మంచి మందు పారాసెటామోల్ (paracetamol ). ఇది crocin, Dolo, calpol తదితర పేర్ల తో దొరుకుతుంది. దీనితో పాటు ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఆంటిబయోటిక్ ను డాక్టర్ లు వ్రాస్తారు. ఇవి పెన్సిలిన్ (amoxy cyllin, cipro floxacin etc) తరహా మందులు, సల్ఫా డ్రగ్స్ (septran etc )cefexime etc. వీటిని డాక్టర్ సలహా మీదే వాడండి.సాధారణ జ్వరం తగ్గుతుంది. ఏంటి బయోటిక్స్ 5 నుండి 7 రోజులు వాడాలి. జ్వరం తగ్గింది అని పూర్తి కోర్స్ వాడక పొతే ఇన్ఫెక్షన్ తిరగ బెడుతుంది. మందులు పూర్తి కోర్సు వాడాలి.
సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి: చంద్రబాబు